- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆయన నా పక్కనుంటే చాలా పెద్దోడిని అవుతా.. వెళ్లి టాప్‌లో కూర్చుంటా’: విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు.

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ చిత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.1871 కోట్లు వసూలు చేసింది. అయితే.. ఈ సినిమా వచ్చి నెలలు దాటినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ చూసినా ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలోని డైలాగ్‌ను నటుడు విజయ్ దేవరకొండ కొట్టారు. ‘ఈసారి కనుక తిరుపతి వెంకన్న స్వామి నా పక్కనుంచి నన్ను నడిపించినాడంటే.. చాలా పెద్దోడిని అయి పూడుస్తా సామి. వెళ్లి టాప్‌లో కూర్చుంటా’ అని పుష్ప-2 సినిమాలోని డైలాగ్‌ను విజయ్ దేవరకొండ కొట్టారు. ప్రస్తుతం ఈ డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన కింగ్‌డమ్ మూవీ(Kingdom Movie) జులై 31వ తేదీన విడుదల కాబోతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మరో యువ నటుడు సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు.






