ఆ డిజాస్టర్ నుంచి త‌ప్పించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ? ల‌క్ అంటే ఇదే

by velandi.Saikiran |

శివ కార్తికేయన్ కంటే ముందు ఈ పరాశక్తి సినిమా కథ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లిందట.

ఆ డిజాస్టర్ నుంచి త‌ప్పించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ? ల‌క్ అంటే ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ఒకటే నెగిటివ్ రిజల్ట్ తెచ్చుకుంది. అంటే తమిళ ఇండస్ట్రీకి పరాశక్తి కూడా బొక్క బోర్లా పడిందని అంటున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా చేయగా శ్రీ లీల హీరోయిన్ గా మెరిశారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీకి నెగిటివ్ రివ్యూ రావడంతో... సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

శివ కార్తికేయన్ హీరోగా చేసిన పరాశక్తి సినిమా కోసం దాదాపు 120 కోట్ల బడ్జెట్ అయిందట. అయితే థియేటర్ రన్ లో కేవలం 45 కోట్లు మాత్రమే వసూలు చేసిందట ఈ సినిమా. కానీ డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తీసుకువచ్చిందని సమాచారం. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి తేలిపోయింది. అమరన్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత శివ కార్తికేయన్ కెరీర్ లో పరాశక్తి రూపంలో భారీ డిజాస్టర్ నమోదు అయినట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.

పరాశక్తి మిస్ చేసుకున్న తెలుగు హీరో ?

శివ కార్తికేయన్ కంటే ముందు ఈ పరాశక్తి సినిమా కథ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లిందట. అయితే ఆ సమయంలో విజయ్ దేవరకొండ.. కింగ్ డమ్ సినిమాతో బిజీగా ఉన్నారట. దీంతో ఆ సినిమాను చేయలేనని రిజెక్ట్ చేశారట విజయ్. దీంతో శివ కార్తికేయన్ కు ఆ అవకాశం వచ్చినట్లు టాక్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దర్శకులు సుధా కొంగర కూడా పేర్కొన్నట్లు సమాచారం. విజయ్ ఒప్పుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను చేయాలని అనుకున్నారట.

Next Story