- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదిగో.. దొరికింది అసలు విషయం.. విజయ్ పక్కనుంది ఆ హీరోయినే..!
అబ్బో.. విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' పోస్టర్‌తో మొదలైన సందేహాలకు ఎట్టకేలకు తెరపడింది..

దిశ, వెబ్ డెస్క్ : అబ్బో.. విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' పోస్టర్‌తో మొదలైన సందేహాలకు ఎట్టకేలకు తెరపడింది.. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' ఒకటి. జాతీయ అవార్డు గ్రహీత, 'జెర్సీ' వంటి హృద్యమైన చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవి కానుకగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, 'కింగ్డమ్' చిత్రంలోని మొదటి పాట ప్రోమో రేపు, ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం నిన్న ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ ఒక రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఒక అమ్మాయితో కలిసి కూర్చుని, వేగంగా దూసుకుపోతున్న రైలు వైపు చూస్తూ కనిపించారు.
ఈ పోస్టర్ విడుదలైన వెంటనే నెటిజన్లు విజయ్ దేవవకొండ పక్కన కూర్చున్న నటి ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ట్విట్టర్ (X) యూజర్లు పెర్ప్లెక్సిటీ, గ్రోక్ వంటి AI అసిస్టెంట్‌లను ట్యాగ్ చేస్తూ "ఈ సినిమాలో ఉన్నది హీరోయిన్ ఎవరు?", " విజయ్ పక్కన ఉన్న హీరోయిన్ ఎవరు?" అని ప్రశ్నలు కురిపించారు. అయితే, ఈ ఊహాగానాలకు తెర దించుతూ 'కింగ్డమ్' మేకర్స్ నిన్ననే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అని అధికారికంగా ప్రకటించారు. భాగ్యశ్రీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'కింగ్డమ్' పాట పోస్టర్‌లతో వరుస పోస్ట్‌లు పెట్టింది.
ఇటీవల విడుదలైన రవితేజ 'మిస్టర్ బచ్చన్' చిత్రంతో భాగ్యశ్రీ తన అందం, నటనతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. 'మిస్టర్ బచ్చన్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, భాగ్యశ్రీకి టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు 'కింగ్డమ్' బాక్సాఫీస్ ఫలితం టాలీవుడ్‌లో ఈ అమ్మడి భవిష్యత్తును నిర్ణయించనుంది. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ ఎలా మెప్పిస్తుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






