- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ దేవరకొండ క్రేజీ రికార్డు... ‘కింగ్‌డమ్’ మాసివ్ కలెక్షన్స్....!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలియని వారు ఉండరు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో బంపర్ విజయాన్ని

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలియని వారు ఉండరు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ... ఆ తర్వాత... పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. అయితే గత కొన్ని రోజులుగా.. సరైన హిట్ లేక సతమతమవుతున్న విజయ్ దేవరకొండ... కింగ్ డమ్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
విజయ్ దేవరకొండ హీరోగా అలాగే భాగ్య శ్రీ హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది కింగ్డమ్ మూవీ. దీంతో సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. పాజిటివ్ టాక్ రావడంతో జనాలు కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్... అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో ఏకంగా ఒక మిలియన్ డాలర్ గ్రాస్ వసూలు చేసిందని చిత్ర బృందం వెల్లడించింది. రిలీజ్ అయిన 24 గంటల్లోపే మిలియన్ మార్క్ టచ్ చేయడం.. విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇదే మొదటిసారి. దీంతో ఈ సినిమా.. రేపటి నుంచి మరిన్ని కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.






