రష్మిక కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. క్యూరియాసిటీ పెంచేస్తున్న న్యూస్!

by Chukka Sudharani |   (  Updated:2024-12-05 11:54:31  IST  )

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పుష్ప (Pushpa) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

రష్మిక కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. క్యూరియాసిటీ పెంచేస్తున్న న్యూస్!
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పుష్ప (Pushpa) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ‘పుష్ప-2’ (Pushpa-2)తో మరోసారి అలరిస్తోంది ఈ బ్యూటీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్(Sukumar) తెరకెక్కించగా.. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక రష్మిక కూడా ప్రజెంట్ వరుస ప్రజెక్టులు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తోంది.

ఈ క్రమంలో రష్మిక నటిస్తున్న తదుపరి చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి (Dixit Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీ టీజర్‌కు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినట్టు ఫిలింనగర్ సర్కిల్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టీజర్ కూడా త్వరలో ఉండబోతున్నట్లు తాజాగా ‘పుష్ప-2’ ఈవెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ కాంబోగా నిలిచిన రష్మిక-విజయ్‌ ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారగా.. ఇప్పుడు ఈ వార్త మరింత హీట్ పెట్టిస్తోంది. అయితే.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే గర్ల్‌ఫ్రెండ్‌ టీజర్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.

Next Story