‘ఈసారి నేను కాదు మనం కొడ్తున్నాం’.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

నటుడు విజయ్ దేవరకొండ(VijayDeverakonda) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఈసారి నేను కాదు మనం కొడ్తున్నాం’.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు విజయ్ దేవరకొండ(VijayDeverakonda) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాత్రి యూసుఫ్ గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌ వేదికగా విజయ్ నటించిన కింగ్‌డమ్(Kingdom Movie) ప్రీరిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు 2000 మంది ఫాన్స్‌ను కలిశా.. అందరూ మనం హిట్ కొడుతున్నాం, టాప్‌లోకి వెళ్తున్నాం అంటున్నారు. మనం అనే పదం own చేసుకుంటేనే వస్తుంది. ఎవరో కుంభమేళాకు వెళ్ళి నా పోస్టర్‌తో మునిగి.. కింగ్‌డమ్ హాట్ కావాలని కోరుకున్నారు. హిట్ కొట్టిన తర్వాత కచ్చితంగా అతని కలుస్తా’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. విజయ్ అన్న పాత్రలో సత్యదేవ్‌(Satyadev) కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌, టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. వీడియో

Next Story