అమిత్ షాను క‌లిసిన‌ విజ‌య్‌ - ర‌ష్మిక జంట

by velandi.Saikiran |

తమ వివాహ రిసెప్షన్ కు హాజరు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆహ్వానించారు.

అమిత్ షాను క‌లిసిన‌ విజ‌య్‌ - ర‌ష్మిక జంట
X

దిశ‌, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), హీరోయిన్ రష్మిక ( Rashmika Mandanna) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ లో ఈ జంట వివాహం జరిగింది. రెండు సాంప్రదాయాల ప్రకారం, విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం జరిగింది. గురువారం ఉదయం 10 గంట‌ల సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్ళు వేశాడు విజయ్ దేవరకొండ. ఇక సాయంత్రం వరకు వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చేసాయి. స్వయంగా విజయ్ దేవరకొండ, రష్మిక తమ తమ సోషల్ మీడియా వేదికగా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన కొత్త పెళ్లి జంట

గురువారం పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఇద్దరూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. సివిల్ డ్రెస్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Union Home Minister Amit Shah ) ఇంటికి వెళ్లారు విజయ్, రష్మిక. ఈ సందర్భంగా తమ రిసెప్షన్ వేడుకకు రావాలని కోరారు. ఇందులో భాగంగానే గణపతి విగ్రహాన్ని అమిత్ షాకు అందించారు. ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మికల రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 4వ‌ తేదీన జరగనుంది. హైద‌రాబాద్ లోని తాజ్ కృష్ణ‌లో రాత్రి 7 గంట‌ల‌కు ఈ కార్య‌క్రమం ప్రారంభం కానుంది.

Next Story