Ustaad Bhagat Singh: ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో విజ‌య్, ర‌ష్మిక !

by velandi.Saikiran |   (  Updated:2026-03-19 03:43:52  IST  )

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నేప‌థ్యంలో థియేటర్లలో విజయ్ దేవరకొండ, రష్మిక మన్యవర్ యాడ్ ప్ర‌ద‌ర్శించారు.

Ustaad Bhagat Singh: ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో విజ‌య్, ర‌ష్మిక !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ( UstaadBhagatSingh). ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజ్ అయింది. దీంతో ఈ మూవీని థియేటర్లలో చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఇప్పటికే తెల్లవారుజామున బెనిఫిట్ షోలు పడిపోగా, యూఎస్ లో ప్రీమియర్స్ టాక్ వచ్చింది. సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమాలో విజయ్, రష్మిక సందడి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) హీరోగా చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో తాజాగా రిలీజ్ కాగా, విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), రష్మిక ( Rashmika) ఇద్దరూ కూడా సినిమా మధ్యలో సందడి చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కొత్త జంట సినిమాలో నటించలేదు కానీ, మన్యవర్ యాడ్ లో ( Manyavar ad ) సందడి చేసింది. అయితే ఈ యాడ్ ను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇంటర్వెల్ సందర్భంగా ప్లే చేసినట్లు తెలుస్తోంది.

ఈ యాడ్ చూసిన సినిమా ప్రియులు, ఫిదా అయిపోతున్నారట. ఇటీవల విజయ్, రష్మిక పెళ్లి చేసుకోగా ఈ యాడ్ కు పాపులారిటీ లభించిందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఇంటర్వెల్ సందర్భంగా ఈ మన్యవర్ యాడ్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ యాడ్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేయగా శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా మెరిశారు. క్లిక్

బాక్సాఫీసును షేక్ చేస్తున్న పవర్ స్టార్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ట్విట్టర్ రివ్యూ

Next Story