నేను చేసింది లీగల్ గేమింగ్ యాప్ ప్రమోషనే : విజయ్ దేవరకొండ

by velandi.Saikiran |

ఈడీ విచారణపై సినీ నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు. నేను చేసింది లీగల్ గేమింగ్ యాప్ ప్రమోషన్, ఇల్లీగల్ బెట్టింగ్

నేను చేసింది లీగల్ గేమింగ్ యాప్ ప్రమోషనే : విజయ్ దేవరకొండ
X

దిశ, వెబ్ డెస్క్ : ఈడీ విచారణపై సినీ నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు. నేను చేసింది లీగల్ గేమింగ్ యాప్ ప్రమోషన్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కాదన్నారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఈడీ విచారణ కాసేపటిక్రితమే ముగిసింది. దాదాపు 4 గంటలు విచారణ కొనసాగింది. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ బ్యాంకు స్టేట్మెంట్ ను పరిశీలించారు అధికారులు. ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాల్లో విచారణ కొనసాగింది.

అవసరమైతే మళ్ళీ విచారణకు వస్తానని అధికారులకు చెప్పిన విజయ్ దేవరకొండ...తాను చేసింది లీగల్ గేమింగ్ యాప్ ప్రమోషన్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కాదన్నారు. ముందు ఈ రెండిటికి తేడా తెలుసుకొని వార్తలు రాయాలని కోరారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కూడా విచారణ జరుగుతోందన్నారు. కానీ నన్ను పిలిచింది గేమింగ్ యాప్ ప్రమోషన్ కేసు విచారణ కోసం అని క్లారిటీ ఇచ్చారు సినీ నటుడు విజయ్ దేవరకొండ. బ్యాంక్ లావాదేవీలు సహా అధికారులు అడిగిన సమాచారమంతా ఇచ్చానన్నారు.

Next Story