Vijay Devarakonda: ఆ కథ నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని నో చెప్పేశా.. రౌడీ హీరో షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

Vijay Devarakonda: ఆ కథ నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని నో చెప్పేశా.. రౌడీ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమవుతున్న విజయ్ ఎలా అయిన మంచి విజయం సాధించాలనే తపనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వంలో ‘కింగ్డమ్’(Kingdom) అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోలు, సాంగ్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham) సినిమా కథను ముందుగా నేనే విన్నాను. కథను మూడు సార్లు విన్నాను.. నేను నటించడంతో పాటు నిర్మించాలని అనుకున్నా.. కానీ ఆ సినిమా కథ నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదేమో అనిపించింది. అందుకే నటించలేకపోయాను’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. కాగా ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్(Sharwanand) హీరోగా నటించగా.. అక్కినేని అమల(Akkineni Amala) కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక దీనికి శ్రీకార్తిక్‌(Sree Karthik) దర్శకత్వం వహించారు.

Next Story