Vijay Devarakonda: రిలీజ్ కు ముందే హిట్ కొట్టేసిన విజయ్ దేవరకొండ .. యూట్యూబ్ లో " కింగ్ డమ్ " ఎన్ని వ్యూస్ వచ్చాయంటే?

by Phanindra |   (  Updated:2025-08-01 11:00:42  IST  )

మనల్ని అలరించడానికి కొత్త మూవీతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.

Vijay Devarakonda: రిలీజ్ కు ముందే హిట్ కొట్టేసిన విజయ్ దేవరకొండ .. యూట్యూబ్ లో  కింగ్ డమ్  ఎన్ని వ్యూస్ వచ్చాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : రౌడీ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఫ్లాప్స్ వస్తున్నా కూడా సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు. తాజాగా, మనల్ని అలరించడానికి కొత్త మూవీతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. " జెర్సీ " ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి " కింగ్ డమ్ " అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఇక, బుధవారం ఈ సినిమా పేరును అధికారికంగా ప్రకటించి టీజర్ ను కూడా విడుదల చేశారు.

జూ. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో మనం ఊహించలేని గెటప్ తో విజయ్ దేవరకొండ పలకరించాడు. ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నట్లు తెలుస్తుంది.

జూ. ఎన్టీఆర్ ఇచ్చిన ఇంట్రడక్షన్ తో " కింగ్ డమ్ " కొత్తగా ఉండబోతుంది. దీంతో ఈ మూవీ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియాగా రిలీజ్ కానున్న ఈ మూవీ టీజర్ ను తెలుగుతో పాటూ తమిళ, హిందీ భాషల్లో కూడా మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. తమిళ్ కు సూర్య వాయిస్ ఇవ్వగా, హిందీకి రణబీర్ కపూర్ లు వాయిస్ ఓవర్ ఇచ్చారు. వరల్డ్ వైడ్ గా మే 30న రిలీజ్ కానుంది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు 10 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఎన్టీయర్ వాయిస్, విజయ్ యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్ అన్నీ బాగా సెట్ అయ్యాయని అని అభిమానులు అంటున్నారు. " అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా " అని విజయ్ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అవుతుంది.

Video Link

Next Story