Vijay Antony: మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న విజయ్.. కొత్త పోస్టర్ వైరల్

by Chukka Sudharani |

ఫేమస్ నటుడు విజయ్ ఆంటోని (Vijay Antony) నటిస్తున్న రీసెంట్ మూవీ ‘మార్గన్’ (Morgan).

Vijay Antony: మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న విజయ్.. కొత్త పోస్టర్ వైరల్
X

దిశ, సినిమా: ఫేమస్ నటుడు విజయ్ ఆంటోని (Vijay Antony) నటిస్తున్న రీసెంట్ మూవీ ‘మార్గన్’ (Morgan). లియో జాన్ పాల్ (Leo John Paul) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తుండటం విశేషం. యాక్షన్-ప్యాక్డ్ (Action-packed) పోస్టర్‌ను చూస్తుంటే విజయ్ ఆంటోనీ, అజయ్‌ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు పాత్రలు తలపడే సీన్లు ప్రేక్షకులకు ఆడ్రినలిన్ రష్‌ ఇచ్చేలా ఉంది. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే మేజర్ పార్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు వదిలిన కొత్త పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హృద్యమైన కుటుంబ చిత్రంగా రానున్న ఈ చిత్రంలో.. సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story