Vijay Antony: మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న విజయ్.. హైప్ పెంచేస్తున్న ట్రైలర్ పోస్టర్

by Chukka Sudharani |

విజయ్ ఆంటోని (Vijay Antony) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Vijay Antony: మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న విజయ్.. హైప్ పెంచేస్తున్న ట్రైలర్ పోస్టర్
X

దిశ, సినిమా: విజయ్ ఆంటోని (Vijay Antony) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘మార్గన్’ (Maargan) ఒకటి. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ (Murder Mystery-Crime Thriller) జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ ఆంటోని ఫిలిమ్స్ కార్పొరేషన్‌పై నిర్మిస్తుండగా.. మీరా విజయ్ ఆంటోని (Meera Vijay Antony) సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇందులో విజయ్ మేనల్లుడు విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 27న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మార్గన్’ ట్రైలర్ (Trailer) ఈనెల 26న సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట భయంకరంగా ఆకట్టుకుంటోంది.

Next Story