- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ ఆంటోని ‘భద్రకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆకట్టుకుంటున్న హీరో పోస్టర్
హీరోగా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్న విజయ్ ఆంటోనీ(Vijay Antony) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: హీరోగా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్న విజయ్ ఆంటోనీ(Vijay Antony) మనందరికీ సుపరిచితమే. ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 25వ చిత్రం ‘భద్రకాళి’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇక దీన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు(Arun Prabhu) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందిస్తున్నారు.
ఇక ఈ మూవీలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మూవీ టీమ్. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. హీరో విజయ్ ఆంటోని చేతిలో చాయ్ గ్లాస్ పట్టుకుని సీరియస్‌గా ఏదో ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. Link






