- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Antony: విశేషంగా ‘భద్రకాళి’ టీజర్.. హీరో పాత్ర అర్థంకాక కన్‌ఫ్యూజ్ అవుతున్న నెటిజన్లు!
మల్టీ స్టారర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం ‘భద్రకాళి’ (Bhadrakali)తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు.

దిశ, సినిమా: మల్టీ స్టారర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం ‘భద్రకాళి’ (Bhadrakali)తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ (First look poster)కు అద్భుతమైన స్పందన వచ్చింది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని (Meera Vijay Antony) సమర్పణలో అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్(Teaser)ను రిలీజ్ చేశారు.
‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్దం, అహంకారం అంతం అవును’.. అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో విజయ్ ఆంటోని అసలు ఏ పాత్రను పోషిస్తున్నాడో అర్థం కాకుండా ఉంది. ఒకసారి ఫ్యామిలీ మెన్(Family man)లా, మరోసారి గ్యాంగ్ స్టర్(Gangster)లా, ఇంకో సందర్భంలో ఉన్నతాధికారి(superior officer)లా కనిపిస్తూ సర్‌ప్రైజ్ (Surprise) చేస్తున్నాడు. అసలు ఈ కిట్టు ఎవరు? అనే ఆసక్తిని రేకెత్తించేలా భద్రకాళి టీజర్‌ను కట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ చివర్లో వచ్చిన డైలాగ్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసినట్టు అయింది. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ కనిపించినంత స్టైలీష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందిస్తుండటం విశేషం.
READ MORE ...
Saptagiri: నవ్వులు పూయిస్తున్న ‘పెళ్లికాని ప్రసాద్’ ట్రైలర్..






