బాలయ్య – కొరటాల శివ ప్రాజెక్టులో హీరోయిన్ ఫిక్స్!

by Chukka Sudharani |

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్టులో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

బాలయ్య – కొరటాల శివ ప్రాజెక్టులో హీరోయిన్ ఫిక్స్!
X

దిశ, సినిమా: ప్రస్తుతం తన ‘NBK-112’ కోసం కూడా సిద్ధం అవుతున్నాడు నందమూరి బాలకృష్ణ. సెన్సేషనల్ డైరెక్టర్ కొరణాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయిందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో విద్యా బాలన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట మేకర్స్. ఫీమేల్ లీడ్ కోసం ఆమెను సంప్రదించగా.. ఒప్పుకున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి టాక్. అలాగే సంజయ్ దత్ మరో కీలక పాత్రలో నటించే అవకాశముందంటూ సమాచారం. అయితే.. నెట్టింట వైరల్ అవుతున్నా ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుండగా, ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కావచ్చు.

Next Story