- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jaali Reddy Wedding: సినిమాలో అలా.. రియల్ లైఫ్ లో ఇలా.. పుష్పా మూవీ విలన్ తన భార్యని ఏం చేశాడో చూడండి
Jaali Reddy Wedding: పుష్ప సినిమాలో జాలిరెడ్డి అనే పాత్రలో విలన్ గా కనిపించిన నటుడు రియల్ లైఫ్ లో చేసిన ఓ పని ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: Jaali Reddy Wedding: పుష్ప సినిమాలో జాలిరెడ్డి(Jaali Reddy) అనే పాత్రలో విలన్ గా కనిపించిన నటుడు రియల్ లైఫ్ లో చేసిన ఓ పని ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య పెళ్లి చేసుకున్న అతను తన భార్య కాళ్లు మొక్కుతున్న వీడియో వైరల్ గా మారింది. పుష్ప మూవీ(pushpa 2 the rule)లో విలన్ గా కనిపించిన ఈ నటుడు పేరు ధనంజయ(Dhananjaya). ఈ కన్నడ నటుడు రియల్ లైఫ్ లో మాత్రం అమ్మాయిలను ఎంతో గౌరవించేవాడని తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతోంది.
ధనంజయ ఈమధ్యే పెళ్లి చేసుకున్నాడు. డాక్టర్ అయిన ధన్యంత గౌరక్లర్(Dhanantha Gauraklar) ను మైసూరులో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల పెళ్లి కొంతమంది సమక్షంలోనే జరిగింది. రెండు రోజులుగా ధనంజయ పెళ్లిఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అతనికి సంబంధించి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ధనంజయ(Dhananjaya) తన భార్య ధన్యం(Dhanantha Gauraklar)త కాళ్లు మొక్కుతూ కనిపించడం విశేషం. పెళ్లి తర్వాత తన కాళ్లు మొక్కడానికి భార్య ప్రయత్నిస్తే..అతను వద్దని వారించాడు. చివరికి సరే అన్నాడు. ఆమె తన కాళ్లు మొక్కన వెంటనే అతను కూడా ఆమె కాళ్లు మొక్కడం విశేషం.
ಡಾಲಿ ಧನಂಜಯ್ ಅವರ ಕಾಲಿಗೆ ಹೆಂಡತಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಲು ಬಂದಾಗ ಬೇಡ ಎಂದು ಹೇಳಿದ ಧನಂಜಯ್ ಅವರು. 😍
— Belagavi - ಬೆಳಗಾವಿ (@BelagaviKA) February 16, 2025
ಹೊಸ ಜೋಡಿಗೆ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಶುಭಾಶಯಗಳು. ನಿಮ್ಮ ದಾಂಪತ್ಯ ಜೀವನ ಸುಖವಾಗಿರಲಿ.❤❤#belagavika #belagavi @Dhananjayaka
VC : Trending News pic.twitter.com/oz8Sqzp4b3
పుష్ప మూవీలో జాలిరెడ్డి పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. బలవంతంగా అమ్మాయిలను అనుభవించే క్యారెక్టర్. అలాంటి పాత్ర పోషించిన ధనంజయ..రియల్ లైఫ్ లో మాత్రం అమ్మాయిలను ఇంతలా గౌరవిస్తాడా అంటూ ఫ్యాన్స్ ఈ వీడియో కామెంట్స్ చేస్తున్నారు.






