Vidaamuyarchi: అజిత్ Vs అర్జున్.. ఆకట్టుకుంటోన్న ‘విడాముయర్చి’ ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2025-08-26 15:51:44  IST  )

అజిత్‌కుమార్‌ (Ajith Kumar), త్రిష (Trisha) జంటగా నటిస్తున్న చిత్రం ‘విడాముయర్చి’ (Vidaamuyarchi).

Vidaamuyarchi: అజిత్ Vs అర్జున్.. ఆకట్టుకుంటోన్న ‘విడాముయర్చి’ ట్రైలర్
X

దిశ, సినిమా: అజిత్‌కుమార్‌ (Ajith Kumar), త్రిష (Trisha) జంటగా నటిస్తున్న చిత్రం ‘విడాముయర్చి’ (Vidaamuyarchi). మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లైకా ప్రొడ‌క్షన్స్‌పై సుభాస్కర‌న్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చి్తరం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ‘విడాముయర్చి’ నుంచి ట్రైలర్ (Trailer) రిలీజ్ చేశారు చిత్ర బృందం.

‘తను నన్ను చూసినప్పుడు.. ఆ మూమెంట్, ఇమేజ్ జీవితాంతం మరవకూడదు’ అని త్రిష డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో స్టార్టింగ్‌లోనే అజిత్ సీరియస్ లుక్‌ (Serious look)లో కనిపించాడు. తర్వాత తను జీవితాన్ని లాస్ అయినట్లు తెలుపుతాడు. ఇక ఇందులో అర్జున్ (Arjun) కూడా ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండగా.. అజిత్ Vs అర్జున్ (Ajith Vs Arjun) అన్నట్టు ఈ కథ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఆకట్టకోవడంతో మూవీపై పాజిటివ్ (Positive) అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. కాగా.. ఈ చిత్రానికి కోలీవుడ్ (Kollywood) రాక్ స్టార్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తెలుగులో ‘పట్టుదా’ అనే టైటిల్‌తో రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో ఆర‌వ్‌, రెజీనా క‌సండ్ర, నిఖిల్ నాయ‌ర్ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story