- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఓటీటీలోకి ‘విదాముయర్చి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ (Kollywood) స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘విదామురయర్చి’.

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ ‘విదామురయర్చి’ (Vidaamuyarchi). మాగిల్ తిరుమేని (Magill Thirumeni) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదలైంది. ఇందులో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సుభాస్కరన్ నిర్మించారు. విడుదలకు ముందు ఇందులో నుంచి అప్‌డేట్స్ అన్నీ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను భారీగా పెంచగా.. ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక చిత్రం వచ్చి నెల కూడా కాకముందే అప్పుడే ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ‘పట్టుదల’ డిజిటల్ స్ట్రీమింగ్ (Digital streaming) హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా.. ఓటీటీ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చింది. అజిత్ యాక్షన్ సీన్‌లో సీరియస్ లుక్‌తో ఉన్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. మార్చి 3 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధం అయినట్లు తెలిపారు.






