Sankranthiki Vasthunnam: రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన విక్టరీ వెంకటేష్.. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన " సంక్రాంతికి వస్తున్నాం "

by Phanindra |   (  Updated:2025-01-21 03:38:48  IST  )

ఇది వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్

Sankranthiki Vasthunnam: రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన విక్టరీ వెంకటేష్.. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన  సంక్రాంతికి వస్తున్నాం
X

దిశ, వెబ్ డెస్క్ : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ ( Venkatesh ) హీరోగా " సంక్రాంతికి వ‌స్తున్నాం" ( Sankranthiki Vasthunam ) మూవీ కూడా జ‌న‌వ‌రి 14న ఆడియెన్స్ ముందుకొచ్చింది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకువెళ్తుంది. ముఖ్యంగా, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అలరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఊచకోత కోస్తుంది. విడుదలైన అయిన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి కొత్త రికార్డు క్రియోట్ చేసింది.

తాజాగా, ఈ సినిమా వారం రోజుల్లో రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఇది వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్. ఇంకా పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.

" గోదారి గట్టు " పాట సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పుకోవాలి. రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ అవ్వడంతో చిత్ర బృందం కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు దూసుకెళ్ళారు. ఓ వైపు రామ్ చరణ్ " గేమ్ ఛేంజర్" , బాలయ్య " డాకు మహారాజ్ "ఉండగా.. వాటన్నింటిని దాటుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. వెంకటేష్ సరసన మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్ లు హీరోయిన్స్ గా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.

Next Story