Venkatesh: ‘ఇతరులలో మీ ఆనందాన్ని ఎప్పుడూ వెతకొద్దు.. అది మిమ్మల్ని ఒంటరిగా చేస్తుంది’: సీనియర్ హీరో

by Kodari Anjali |   (  Updated:2025-02-24 10:12:17  IST  )

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Venkatesh: ‘ఇతరులలో మీ ఆనందాన్ని ఎప్పుడూ వెతకొద్దు.. అది మిమ్మల్ని ఒంటరిగా చేస్తుంది’: సీనియర్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరో అనేక చిత్రాల్లో నటించి.. సినీ ఇండస్ట్రీలో అండ్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విభిన్నమైన కంటెంట్‌తో జనాల ముందుకొచ్చి.. ఎంటర్‌టై్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాలకు వెంకటేష్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ హీరో కామెడీ, పంచెస్‌తో కూడా జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. సినిమా హిట్ అయినా.. కాకపోయినా వెంకటేష్ అన్నింటిని తట్టుకుని ఈ స్థాయికి ఎదిగారు. పవిత్రబంధం (Pavitrabandham), బ్రహ్మపుత్రుడు (Brahmaputrudu), ప్రేమించుకుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నువ్వు నాకు నచ్చావ్, ఎఫ్ 3 వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

ఇకపోతే వెంకటేష్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌ పెడుతుంటారు. జీవిత సత్యాలు మాట్లాడుతుంటాడు. తాజాగా ఈ నటుడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా ఓ మంచి మాట రాసుకొచ్చారు. ‘‘ఇతరులలో మీ ఆనందాన్ని ఎప్పుడూ వెతకకండి. అది మిమ్మల్ని ఒంటరిగా చేస్తుంది. మీలో శోధించండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటారు’’ అంటూ విక్టరీ వెంకటేష్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈయన ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story