- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో మరో విషాదం...క్యాన్సర్ తో నటి మృతి
ప్రముఖ నటి ప్రవీణ దేశ్‌పాండే బ్లడ్ క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత మరణించారు.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మరణించగా, లేటెస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ నటి మృతి చెందారు. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రవీణా దేశ్ పాండే ( Pravina Deshpande) మరణించారు. 60 సంవత్సరాలు ఉన్న బాలీవుడ్ నటి ప్రవీణా దేశ్ పాండే చాలా రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ అని తెలుస్తోంది. అయితే ఈ క్యాన్సర్ ఉన్న నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు నటి ప్రవీణా దేశ్ పాండే. ఈ మేరకు ఈ విషయాన్ని ప్రవీణా దేశ్ పాండే కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా హిందీ, మరాఠీ సినిమాలతో పాటు టీవీ, వెబ్ సిరీస్ లలో కూడా ప్రవీణా దేశ్ పాండే నటించి మెప్పించారు. సల్మాన్ ఖాన్ తో రెడీ మూవీతో పాటు ఏక్ విలన్, పరమాణు లాంటి ఎన్నో సినిమాల్లో మెరిశారు. ఇక ప్రవీణా దేశ్ పాండే మృతి నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు సంతాపం తెలుపుతున్నారు. ఇది ఇలా ఉండగా సల్మాన్ ఖాన్ తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించిందట. ఆయనను వెంటిలేటర్ పై ఉంచినట్లు తెలుస్తోంది. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.






