- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్ర పరిశ్రమలో మరో విషాదం..గుండెపోటుతో నటుడు మృతి
బాలీవుడ్ నటుడు భరత్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది కళాకారులను ఇండస్ట్రీ కోల్పోయింది. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటుడు భరత్ కుమార్ (Veteran actor Bharat Kapoor) గుండెపోటుతో మృతి చెందారు. 80 సంవత్సరాల భరత్ కుమార్, ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1970 సంవత్సరంలో నట జీవితాన్ని ప్రారంభించిన ఆయన సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశారు. భాగ్య విధాత, పరంపర లాంటి సీరియల్ లో మెరిసిన భరత్ కుమార్, దేశ్ పరదేశ్, రామ్ బలరాం, నూరి, లవ్ స్టోరీ లాంటి 80 కి పైగా సినిమాల్లో నటించి అందరిని మెప్పించారు. ఇక ఆయన మృతి పట్ల ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సంతాపం తెలిపారు.






