- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prabhas: చాలా సంతోషంగా ఉంది.. సంథింగ్ స్పెషల్ అంటూ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పెళ్లి గురించేనా?
పాన్ ఇండియా ప్రభాస్(Prabhas) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. గత ఏడాది ‘కల్కి’ (Kalki)సినిమాతో హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా ప్రభాస్(Prabhas) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. గత ఏడాది ‘కల్కి’ (Kalki)సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. త్వరలో ‘ది రాజాసాబ్’(The Rajasaab) చిత్రంతో డార్లింగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీతో పాటు ప్రభాస్ ‘కన్నప్ప’(Kannappa) లోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే స్పిరిట్, ఫౌజి, సలార్-2, కల్కి-2 వంటి చిత్రాలను లైన్‌లో పెట్టాడు. దీంతో గత కొద్ది కాలంగా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నాడు. కానీ తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం వెల్లడించడంలేదు. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశాడు. హను రాఘవపూడి బర్త్ డే కావడం విషెస్ తెలుపుతూ ఫొటోను కూడా పెట్టాడు. అలాగే ‘‘మీతో కలిసి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టులో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంథింగ్ స్పెషల్’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అంతా పెళ్లి గురించే అని భ్రమ పడుతున్నారు. కానీ డార్లింగ్ చెప్పింది ఫౌజి సినిమా గురించి అని తెలుసుకుని నిరాశ చెందుతున్నారు. కాగా, గత కొద్ది కాలంగా ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రేమించుకుంటున్నారని పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరు మాత్రం ఎన్నా్ళ్ల నుంచో వస్తున్న వార్తలపై స్పందించకపోవడంతో పుకార్లకు చెక్ పడటం లేదు. నిత్యం వీరికి సంబంధించిన ఫొటోలను కూడా ఏఐ ద్వారా ఎడిట్ చేసి షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.






