HYD: పవన్ ఫ్యాన్స్‌కు పండగ.. దద్దరిల్లనున్న పోలీస్ గ్రౌండ్స్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-14 10:31:17  IST  )

పవర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

HYD: పవన్ ఫ్యాన్స్‌కు పండగ.. దద్దరిల్లనున్న పోలీస్ గ్రౌండ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన OG సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న పవన్.. ఇప్పుడు మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఉగాది కానుకగా ఈనెల 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేసింది. మార్చి 15న హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ప్రీ-రిలీజ్‌ వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘OG’ విజయోత్సవ కార్యక్రమం తర్వాత మళ్లీ సినిమా ఈవెంట్‌లో పవన్ కనిపించబోతుండటంతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.

Next Story