లెనిన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వేదిక ఖరారు

by Pulgam srinivas |

'లెనిన్' ట్రైలర్‌ను రేపు సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నంలోని శరత్ థియేటర్‌లో లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

లెనిన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వేదిక ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్'. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన వేదికను ప్రకటిస్తూ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నంలోని శరత్ థియేటర్‌లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే ఈ ట్రైలర్‌పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంతో అఖిల్‌కు భారీ విజయం దక్కుతుందని అభిమానులు, సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి 'లెనిన్'తో అఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.




Next Story