- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవుడిపైనే భారమంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన వేణు స్వామి భార్య.. ఆందోళనలో ఫ్యాన్స్
ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానంలో ప్రయాణం చేయాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swami) భార్య వాణిశ్రీ ప్రయాణిస్తోన్న విమానంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమెతో పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియో షేర్ చేశారు. ‘అనుకోకుండా విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే విమానంలోకి ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఎంతో భయంతోనే ఉన్నాను. అసలు సేఫ్‌గా భూమి మీదకు ల్యాండ్ అవుతామా? లేదా? గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయా? అనే భయంతోనే విమాన ప్రయాణం చేశాను.
ఈ విమానంలో ప్రయాణిస్తున్నంత సేపు భగవంతుడిపైనే భారం వేశాను. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు ఏసీలు పని చేయలేదు. దీని వల్ల వందలాది మంది ప్రయాణికులు అందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. ఇలా ఏసీలు పనిచేయకపోవడంతో విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే సందేహాలు అందరికీ కలిగాయి. ఇదే విషయం గురించి సిబ్బందిని ప్రశ్నించిన సరైన సమాధానం మాత్రం రాలేదు. ఇలా ఏసి పనిచేయకపోవడంతో ఇదేదో చెడుకు సంకేతంగా భావించాం. విమానం దిగే వరకు క్షణక్షణం భయంతోనే గడిపాం.
వందల మందితో ప్రయాణం చేస్తున్నటువంటి విమానంలో ఇంత పెద్ద సమస్య ఉంటే ఎవరు సమస్యను పట్టించుకోవడం లేదు? ఈ సమస్య గురించి ప్రశ్నిస్తే సిబ్బంది మాత్రం చిన్న సారీ చెబుతున్నారు. సారీ చెబితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ‘ అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది వీణా శ్రీవాణి(Veena Srivani). ఏది ఏమైనా తాము ప్రయాణిస్తోన్న విమానంలో ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా చాలా సేఫ్‌గా ల్యాండ్ అయ్యామని వీడియోలో చెప్పుకొచ్చింది వేణు స్వామి భార్య. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు విమాన ప్రయాణం అంటేనే చాలా భయమేస్తుంది అంటూ ఆందోళన చెందుతున్నారు. Link






