అల్లు అర్జున్ అరెస్ట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వేణు స్వామి జాతకం (వీడియో)

by Hamsa |
అల్లు అర్జున్ అరెస్ట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వేణు స్వామి జాతకం (వీడియో)
X

దిశ, సినిమా: ఇటీవల ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) ప్రీమియర్ షోస్ వేయగా.. ఆర్టీసీ క్రాస్ రోడ్‌(RTC Cross Road)లోని సంధ్య థియేటర్స్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, ఈ కేసులో అల్లు అర్జున్‌(Allu Arjun)ను చిక్కడ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రెండు గంటలపాటు విచారణ జరిపిన హైకోర్టు రిమాండ్ తరలించాలని వెల్లడించింది. కానీ చివరి నిమిషంలో కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు(High Court) ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

పర్సనల్ బాండ్ తీసుకొని విడుదల చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సోషల్ మీడియాలో వేణు స్వామి(Venu Swamy) వీడియో ఒకటి మరోసారి వైరల్‌గా మారింది. గతంలో ఆయన అల్లు అర్జున్ జాతకం చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇందులో ఏముందంటే.. ‘‘నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకో 15 ఏళ్ల వరకు’’ అని చెప్పారు. ఈ వీడియోకు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వీడియో యాడ్ చేసి ‘నువ్వు చెప్పిన రాజయోగం ఇదేనా ఇట్టా ఉంటదా’ అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed