- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నితిన్ ‘ఎల్లమ్మ’ మూవీకి సర్వం సిద్ధం.. ఒక్క పోస్ట్‌తో అసలు విషయం చెప్పేసిన వేణు!
జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu Yeldandi)‘బలగం’ సినిమాతో డైరెక్టర్‌గా మారాడు.

దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu Yeldandi)‘బలగం’ సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పల్లెటూరు నుంచి బస్సులు కట్టుకొని వచ్చి మరీ ఈ మూవీని చూశారు. ఇక ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ‘బలగం’(balagam) చూసి ఎంతోమంది కన్నీరు పెట్టుకున్నారు. గొడవలు జరిగిన కుటుంబ సభ్యులు మళ్లీ ఒక్కటయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. బాక్సాఫీసు వద్ద ‘బలగం’ భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దీంతో వేణు రెండో సినిమాపై అందరి దృష్టి పడింది. ఈక్రమంలోనే. ఆయన తన రెండవ చిత్రాన్ని ‘ఎల్లమ్మ’(yellamma) టైటిల్‌తో తీసుకురాబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశాడు. దీంతో అంతా ఇందులో హీరోగా ఎవరు నటిస్తారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఏడాది పాటు స్క్రిప్ట్ పట్టుకుని వేణు అందరి చుట్టూ తిరగ్గా.. నానికి క్లామాక్స్ నచ్చకపోవడంతో తిరస్కరించారట. ఇక ఈ సినిమాలో నటించేందుకు నితిన్(Nithin) ఒప్పుకున్నట్లు సమాచారం. గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. అయితే అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, వేణు ట్విట్టర్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘ఎల్లమ్మ’ అంటూ స్క్రిప్ట్ బుక్ పట్టుకుని ఉన్న పిక్ షేర్ చేశాడు. అయితే త్వరలోనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.






