Vennela Kishore: ఆ క్యారెక్టర్ చేడయం నా అదృష్టం.. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.. నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |
Vennela Kishore: ఆ క్యారెక్టర్ చేడయం నా అదృష్టం.. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.. నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించగా.. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ మే 9న థియేటర్లలోకి వచ్చి అందరినీ అలరిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెన్నెల కిషోర్ తన పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘డైరెక్టర్ రాజ్ చాలా మంచి పర్సన్. శ్రీ విష్ణు చాలా స్పాంటీనియస్‌గా డైలాగ్స్‌ని ఇంప్రవిజ్ చేసేస్తారు. దానికి పక్కన అంతే స్పాంటేనియస్‌గా రియాక్షన్ ఇచ్చే యాక్టర్ ఉండాలి. అలాంటి స్పాంటేనియస్ క్యారెక్టర్‌కి నేనైతే కరెక్ట్ అని డైరెక్టర్ భావించారు. అందుకే శ్రీ విష్ణు ఉండే ఫ్రేంలో వెన్నెల కిషోర్ ఉండాలని ఆయన ముందే ఫిక్స్ అయ్యారు. మనం చికెన్ బిర్యాని తిన్నప్పుడు అప్పుడప్పుడు లివర్ పీస్ వస్తుంది. అది బిర్యానికి ఒక టేస్ట్‌ని తీసుకొచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలాంటిదే.. ఈ సినిమా కథ విన్నప్పుడే చాలా హిలేరియస్‌గా అనిపించింది. భాను నందు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అదే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీదకు వచ్చింది. సినిమాని థియేటర్స్‌లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నా సినిమా నేను స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు కంటే... ఆడియన్స్‌తో కలిసి చూసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ నాకు చాలా ఆనందం ఇచ్చింది.. ఈ క్యారెక్టర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed