న్యూ ఇయర్ స్పెషల్‌గా వెంకీ క్లాసికల్ హిట్ మూవీ రీరిలీజ్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-15 06:50:42  IST  )

స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.

న్యూ ఇయర్ స్పెషల్‌గా వెంకీ క్లాసికల్ హిట్ మూవీ రీరిలీజ్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్‌(Thrivikram)తో ఆదర్శ్ కుటుంబం మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే వెంకీ కెరీర్‌లో ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టని సినిమా ఏది? అని అడిగితే ఎక్కువమంది నుంచి వచ్చే జవాబు ‘నువ్వు నాకు నచ్చావ్‌’(Nuvvu Naku Nachav). ఎందుకంటే ఆ కంటెంట్‌కున్న విలువ అలాంటిది మరి. 2001, సెప్టెంబర్‌ 6న విడుదలైన ఈ సినిమా క్లాసికల్ హిట్‌గా నిలిచింది.

అయితే అంతటి హిట్ అయిన ఈ మూవీ మళ్లీ నేటి తరానికి స్వచ్ఛంగా అందించేందుకు రంగం సిద్ధమైంది. ‘నువ్వునాకు నచ్చావ్‌’ చిత్రాన్ని పూర్తి సాంకేతిక హంగులతో 4కె లోకి కన్వర్ట్‌ చేసి, న్యూఇయర్ ట్రీట్‌గా 2026, జనవరి 1న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

వెంకటేశ్‌, ఆర్తి అగర్వాల్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ, తివిక్రమ్‌ మాటల మాయాజాలం, ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుగా దర్శకుడు విజయభాస్కర్‌ మలచిన తీరు.. వీటన్నింటితోపాటు సంగీత దర్శకుడు కోటి అందించిన అద్భుతమైన సంగీతం ఈ చిత్రాన్ని క్లాసిక్‌గా నిలబెట్టాయని చిత్ర నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేవలం రీరిలీజ్‌ మాత్రమే కాదని, నూతన సంవత్సరంలో ఆడియన్స్‌కి తామందిస్తున్న కానుకని, ఈ సినిమా మా టీమ్‌కు ఓ అద్భుతమైన అనుభవమని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Next Story