వెంకీమామ ఆదర్శ కుటుంబం.. ఇది గమనించారా?

by Naga Rani Yarlagadda |

పదకొండేళ్ల తర్వాత వెంకీమామ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది.

వెంకీమామ ఆదర్శ కుటుంబం.. ఇది గమనించారా?
X

దిశ, వెబ్‌డెస్క్: పదకొండేళ్ల తర్వాత వెంకీమామ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. మళ్లీ ఇన్నేళ్లకు సినిమా తీస్తుండటంతో పక్కా హిట్ కొడతారని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయ. బుధవారం సినిమా టైటిల్ తో పాటు వెంకటేష్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

చూడటానికి ఫ్యామిలీ మ్యాన్ లా కనిపించినా.. ఈ సినిమా దృశ్యం రేంజ్ థ్రిల్లర్ గా ఉండొచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. టైటిల్ ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. కుటుంబంలో ఆఖరున రక్తం కారుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇది క్రైమ్ రిలేటెడ్ సినిమా అని త్రివిక్రమ్ చెప్పకనే చెప్పారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో 77వ చిత్రంగా రూపొందుతోంది. 2026 సమ్మర్లో సినిమా విడుదల కావొచ్చని తెలుస్తోంది. వెంకటేష్ కామెడీ టైమింగ్ తో పాటు.. ఫ్యామిలీ సెంటిమెంట్ తో వెండితెరపై ఫుల్ మీల్స్ పెట్టేలా సినిమా తెరకెక్కుతోంది.

Next Story