Venky 77: ‘వెంకీ77’ షూటింగ్ స్టార్ట్.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటో

by Chukka Sudharani |

విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Venky 77: ‘వెంకీ77’ షూటింగ్ స్టార్ట్.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటో
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ కెరీర్‌లో 77వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టులో పూజ కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ చెయ్యగా.. తాజాగా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘దాదాపు 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కెమెరా వెనుక తిరిగి వచ్చారు.. అందరికీ ఇష్టమైన వెంకీమామతో చేతులు కలిపి మరింత ఎంటర్‌టైన్మెంట్‌ను పంచేందుకు సిద్ధం అవుతున్నారు’ అంటూ Venky77 షూటింగ్ సెట్‌లో వెంకటేష్, త్రివిక్రమ్ పాల్గొన్నట్లు ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ సినిమాను రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్. లింక్


Next Story