ట్రెండీ లుక్‌లో నెట్టింట గత్తర లేపుతున్న వెంకటేష్ మాజీ లవర్.. క్యూటీ పై అంటూ నెటిజన్ల కామెంట్స్

by I. Sairam |

‘ఇచట వాహనాలు నిలపరాదు‘ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయిన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ట్రెండీ లుక్‌లో నెట్టింట గత్తర లేపుతున్న వెంకటేష్ మాజీ లవర్.. క్యూటీ పై అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 'ఇచట వాహనాలు నిలపరాదు' మూవీతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయిన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫస్ట్ మూవీతోనే ఈ చిన్నది మంచి విజయం తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత మ్యాగ్జిమమ్ ఈ భామ నటించిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ప్రజెంట్ నాగ చైతన్య అండ్ నవీన్ పొలిశెట్టి‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. మరోపక్క ఈ చిన్నది నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అలాగే హాట్, ట్రెండీ అవుట్ ఫిట్స్‌లో సూపర్ అనిపిస్తూ ఫాలో వర్స్‌‌ను పెంచుకుంటుంది.

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా మీనాక్షి తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో హెయిర లీవ్ చేసుకుని, గోల్డ్ కలర్ ఆర్నమెంట్స్‌తో మెస్మరైజ్ చేసింది. క్యూట్ డ్రెస్సులో కిర్రాక్ అనిపించింది. ఇక ఈ పిక్స్‌కు ‘హలో ఉన్నారా’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు క్యూటీ పై అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ అమ్మడు ఫొటోస్‌ పై ఓ లుక్ వేసేయండి.

Next Story