- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దృశ్యం 3 మూవీ...తెలివిగా తప్పించుకున్న వెంకీ మామ ?
దృశ్యం 3 మూవీ రిలీజ్ అయిన తరుణంలో తెలివిగా వెంకీ మామ తప్పించుకున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు కూడా పోటీనిస్తూ దూసుకు వెళ్తున్నాడు. ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసి, మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. గత సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సందడి చేసిన వెంకీ మామ, మొన్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో గెస్ట్ రోల్ చేసి ఇరగదీశారు. ఇప్పుడు మళ్లీ అనిల్ రావిపూడితో పాటు త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే అలాంటి విక్టరీ వెంకటేష్ తెలివిగా దృశ్యం 3 సినిమా నుంచి తప్పించుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మోహన్ లాల్ హీరోగా చేసిన ఈ దృశ్యం 3 సినిమా గురువారం రిలీజ్ అయింది. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగులో వచ్చిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలలో విక్టరీ వెంకటేష్ నటించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దృశ్యం 3 సినిమా నుంచి వెంకీ మామ తప్పుకున్నాడు. వరుసగా ఇతర ప్రాజెక్టులు ఉన్న నేపథ్యంలో దృశ్యం 3 సినిమాను వదులుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇది విక్టరీ వెంకటేష్ కు మంచే చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇవాళ రిలీజ్ అయిన దృశ్యం 3 సినిమా పైన నెగిటివ్ టాక్ వస్తోంది. మొదటి రెండు సినిమాల తరహాలో దృశ్యం 3 ఆడే అవకాశాలు లేనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ తెలివిగా దృశ్యం 3 నుంచి తప్పించుకున్నాడని అంటున్నారు.






