చిరు మూవీలో వెంకీ పాత్ర ఇదే..న‌య‌న‌తార‌నే పెళ్లి చేసుకుంటాడా ?

by velandi.Saikiran |   (  Updated:2026-01-04 11:24:18  IST  )

మన శంకర వరప్రసాద్ గారులో నయనతారను రెండో పెళ్లి చేసుకునేందుకు వెంకటేష్ వస్తాడట. అంతకు ముందే మెగాస్టార్ చిరంజీవితో విక్టరీ వెంకటేష్ కు స్నేహం ఉంటుందట.

చిరు మూవీలో వెంకీ పాత్ర ఇదే..న‌య‌న‌తార‌నే పెళ్లి చేసుకుంటాడా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu). సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాను సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్ కూడా లాంచ్ చేసింది. అయితే చిరంజీవి నటిస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపిస్తారట. వీళ్ళిద్దరి మధ్య ఓ సాంగ్ కూడా ఉంది. దాదాపు ఈ సినిమాలో 20 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ కనిపిస్తారని చెబుతున్నారు. హెలికాప్టర్ లో విక్టరీ వెంకటేష్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. ఈ విషయాన్ని ట్రైలర్ లో చూపించారు.

అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ పాత్ర గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో నయనతారను రెండో పెళ్లి చేసుకునేందుకు వెంకటేష్ వస్తాడట. అంతకు ముందే మెగాస్టార్ చిరంజీవితో విక్టరీ వెంకటేష్ కు స్నేహం ఉంటుందట. ఈ విషయం తెలియకుండా విక్టరీ వెంకటేష్ ను రెండో పెళ్లి కోసం నయనతార ఫ్యామిలీ దింపుతారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్, చిరంజీవి చేసే కామెడీ జనాలను బాగా ఆకట్టుకుంటుందట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా ఈ మూవీ జ‌న‌వ‌రి 12వ తేదీన రిలీజ్ కానుంది.

READ MORE ....

రప్ఫాడించిన చిరంజీవి.. హైప్ పెంచిన ట్రైలర్

Next Story