26 ఏళ్ల రాజా.. స్టార్ హీరోలకు వణుకు పుట్టించే రికార్డు కొట్టిందిగా

by Pulgam srinivas |

వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన రాజా మూవీకి బుల్లితెరపై వరుసగా 7.41, 5.5, 6.07 టీఆర్పీ రేటింగ్స్ దక్కాయి.

26 ఏళ్ల రాజా.. స్టార్ హీరోలకు వణుకు పుట్టించే రికార్డు కొట్టిందిగా
X

దిశ, వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్ హీరోగా, సౌందర్య హీరోయిన్ గా 1999వ సంవత్సరంలో 'రాజా' అనే సినిమా వచ్చింది. విక్రమన్ ఈ సినిమాకు కథను అందించగా, ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్. బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించాడు. ఆ సమయంలో మంచి క్రేజ్ కలిగిన నటుడు అయిన అబ్బాస్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ చిత్రం ఆ సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని వెంకటేష్, సౌందర్య నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఈ చిత్రం విడుదలై 26 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ మూవీకి చాలామంది అభిమానులు ఉన్నారు. దానితో ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయినా కూడా మంచి టీఆర్పీ రేటింగ్ను సొంతం చేసుకుంటుంది. ఈ మూవీ కొంతకాలం క్రితం బుల్లితెరపై ప్రసారం అయింది. ఆ సమయంలో ఈ సినిమాకు 7.41 రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ దక్కింది. తర్వాత కొన్ని రోజుల గ్యాప్ లోనే ఈ సినిమాను మళ్ళీ ప్రసారం చేయగా, అప్పుడు ఈ సినిమా 5.5 రేంజ్ లో రేటింగ్ను దక్కించుకుంది.

మళ్లీ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను టెలికాస్ట్ చేయగా, అప్పుడు కూడా ఈ సినిమాకు 6.7 టీఆర్పీ రేటింగ్ దక్కింది. సినిమా విడుదలై 26 సంవత్సరాల తర్వాత కూడా వరుసగా అద్భుతమైన రేటింగ్ దక్కుతుండడంతో ఇది మామూలు విషయం కాదు అని, టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన కొన్ని మూవీలకు రెండవ, మూడవసారి కూడా ఈ రేంజ్ టీఆర్పీ రేటింగ్ దక్కని సందర్భాలు ఉన్నాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Next Story