- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వెంకటేష్ హీరోయిన్.. బాబు పేరును రివీల్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన ‘మల్లీశ్వరీ’(Malliswari) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కత్రినా కైఫ్(Katrina Kaif) గురించి మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన ‘మల్లీశ్వరీ’(Malliswari) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కత్రినా కైఫ్(Katrina Kaif) గురించి మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ సినిమానే మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత బాలకృష్ణ(Balakrishna)తో కలిసి ‘అల్లరి పిడుగు’(Allari Pidugu) మూవీలో నటించింది. అయితే ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. దీంతో మళ్ళీ బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది.
ఇక ఈ చిన్నదాని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే హీరో విక్కీ కౌశల్(Vickey Koushal)తో లవ్‌లో పడింది. అలా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట 2021 డిసెంబర్ 9వ తేదీన పెళ్లిపీటలెక్కారు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా గతేడాది ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది కత్రినా. పెళ్లయిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత కత్రినా-విక్కీ కౌశల్‌లు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. అయితే తమ కుమారుడి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్న ఈ జంట ఎట్టకేలకు తాజాగా తన కుమారుడిని పరిచయం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొడుకు ఫొటోతో పాటు, పేరును కూడా రివీల్ చేస్తూ పోస్ట్ పెట్టింది.
ఇక పోస్టులో కత్రినా, విక్కీ కౌశల్‌ల చేతిలో తమ కుమారుడి చేయి ఉన్న ఫొటోని షేర్ చేశారు. అలాగే ‘మా కాంతి కిరణం.. విహాన్ కౌశల్.. మేము చేసిన ప్రార్థనలకు సమాధానం దొరికింది. ఇప్పుడు మా జీవితం చాలా అందంగా ఉంది. ఒక్క క్షణంలో ఈ ప్రపంచం మొత్తం మారిపోయింది’ అని కత్రినా ఎమోషనల్ క్యాప్షన్ జోడించింది. అయితే ఈ ఫొటోల్లో తన కొడుకు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఈ ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కత్రినా దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Read More..
Naga Chaitanya: తల్లి కాబోతున్న శోభిత ధూళిపాళ.. ఉత్తేజకర పరిణామాలంటూ హింట్ ఇచ్చేసిన నాగచైతన్య






