- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sankranthiki Vasthunam: అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేసిన వెంకటేష్.. లెక్కలన్నీ మార్చేసిన " సంక్రాంతికి వస్తున్నాం" సినిమా..!
గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన " అలా వైకుంఠపురం" మూవీ పేరిట ఉన్న ఈ రికార్డు సంక్రాంతికి వస్తున్నాం ఈ రికార్డును క్రాస్ చేసింది

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయో .. ఈ పొంగల్ కి కూడా స్టార్ హీరోల సినిమాలు బరిలో దిగాయి. రామ్ చరణ్ " గేమ్ ఛేంజర్ " ( Game Changer ) జనవరి 10 న రిలీజ్ కాగా , బాలయ్య " డాకు మహారాజ్ " 12 న , వెంకటేష్ ( Venkatesh ) " సంక్రాంతికి వస్తున్నాం " ( sankranthiki vasthunnam )మూవీ 14 న విడుదలైంది. ఈ మూడు సినిమాలలో వెంకీ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి 2025 సంక్రాంతి విన్నర్ గా నిలిచి సంబరాలు చేసుకుంటుంది. తాజాగా, ఈ మూవీ అల్లు అర్జున్ పేరిట ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేసి భాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
వారం రోజుల్లో ఈ మూవీ మొత్తం రూ. 200 కోట్లను కలెక్షన్లు క్రాస్ చేసినట్లు సినీ వర్గాలు వారు చెబుతున్నారు. కేవలం ఏడు రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా వసూలు సాధించిన తెలుగు మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఒక్క తెలుగులోనే రిలీజ్ అయి ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడమంటే మాములు విషయం కాదు. 200 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా రికార్డులు సృష్టించింది.
గతంలో అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా నటించిన " అలా వైకుంఠపురం" మూవీ పేరిట ఉన్న ఈ రికార్డు సంక్రాంతికి వస్తున్నాం ఈ రికార్డును క్రాస్ చేసింది. కామెడీ జోనర్ కలిసి రావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో క్యాష్ చేసుకుని రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది.






