- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Venkatesh and Trivikram: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో రిపీట్.. మరో బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీనా అంటున్న నెటిజన్లు!
విక్టరి వెంకటేష్ (Venkatesh) ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: విక్టరి వెంకటేష్ (Venkatesh) ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈయన త్వరలో ‘రామానాయుడు-2’ (Ramanaidu-2) ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా వెంకటేష్ నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. వెంకటేష్ తన తదుపరి మూవీ కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. మరోసారి ఈ క్రేజీ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసేందుకు కథ కూడా సిద్ధంగా ఉందని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. అలాగే దీనిపై జూన్ నెలలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు భారీగా టాక్ వినిపిస్తుండటంతో.. వెంకటేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటికే ‘నువ్వు నాకు నచ్చావు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2001లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు చూసిన కూడా ఆడియన్స్‌కు ఓ ఫ్రెస్ ఫీల్‌ను ఇస్తుంది. అలాంటి ఈ కాంబో మరోసారి రాబోతుందనే వార్త వైరల్ కావడంతో.. మరో బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






