సంక్రాంతి జోడీలు ఫిక్స్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల హీరోయిన్లు ఎవరంటే?

by Chukka Sudharani |

వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా, హిట్ మిషన్ డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు టాక్.

సంక్రాంతి జోడీలు ఫిక్స్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల హీరోయిన్లు ఎవరంటే?
X

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మల్టీస్టారర్ చిత్రం అనౌన్స్‌చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ కొత్త ప్రాజెక్టులో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్‌ని కలిపి ఈ కొత్త చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ అనిల్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట సందడి చేస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ రామ్‌కు కూడా జోడీ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. ఈ మేరకు ఇందులో కళ్యాణ్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా ఫిక్స్ అయిందట. ఇక వెంకటేష్, కీర్తి సురేష్ - కళ్యాణ్ రామ్, కృతి శెట్టి సంక్రాంతి జోడీలు సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. త్వరలోనే దీనిపై త్వరలోనే అఫీషియల్ అప్డేట్ రాబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతుండగా.. మంచి ప్లానే వేశాడు అనిల్ రావిపూడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే ఈ సినిమాతో అయిన యంగ్ బ్యూటీ కృతి శెట్టికి మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ చిత్రం 2027 సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Next Story