వెంకటేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రతి కుటుంబం గుర్తుంచుకోదగ్గ ప్రత్యేకమైన రోజు అంటూ పోస్ట్

by Chukka Sudharani |

విక్టరీ వెంకటేష్ ‘ఆదర్శకుటుంబం’ సినిమా రిలీజ్ డేట్ విడుదల చేశారు మేకర్స్.

వెంకటేష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రతి కుటుంబం గుర్తుంచుకోదగ్గ ప్రత్యేకమైన రోజు అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కుర్రహీరోలకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్న సీనియర్ అండ్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇది ఫుల్ ఫ్యామిలీ డ్రామా అని హింట్ ఇచ్చిన మేకర్స్.. తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుపుతూ ‘ప్రతి కుటుంబం గుర్తుంచుకోదగ్గ ఒక ప్రత్యేకమైన రోజు.. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘ఆదర్శకుటుంబం’ తలుపులు తెరుచుకోనున్నాయి’ అంటూ ఓ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. ఇక విడుదల చేసిన పోస్టర్‌లో వెంకటేష్, శ్రీనిథి శెట్టితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీ ఫొటోను రిలీజ్ చేయగా.. ప్రజెంట్ ఇది వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటోంది. కాగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story