Veethika Sheru: చిన్న వయసులో ఆడిషన్ సమయంలో మా అమ్మ ముందే అలా అడిగారు

by Pulgam srinivas |

వితిక శేరు మాట్లాడుతూ... నాకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఓ సినిమా ఆడిషన్‌కి వెళ్లాను. ఆ సమయంలో వారు కమిట్మెంట్ గురించి అడిగినట్లు ఈ నటి తాజాగా చెప్పుకొచ్చింది.

Veethika Sheru: చిన్న వయసులో ఆడిషన్ సమయంలో మా అమ్మ ముందే అలా అడిగారు
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ప్రభావం ఎక్కువగా ఉందని, దానివల్ల కొంతమంది అమాయకులు బలవుతున్నారనే వాదనను అనేకమంది అనేకసార్లు వినిపించారు. కొంతమంది బహిరంగంగానే తాము సినిమా పరిశ్రమలో అలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్‌లో నటిగా గుర్తింపు సంపాదించుకున్న వితిక శేరు తాజాగా తనకు చిన్న వయసులో ఎదురైన ఒక సంఘటన గురించి ఓపెన్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ… “నాకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఓ సినిమా ఆడిషన్‌కి నేను మా అమ్మతో కలిసి వెళ్లాను. ఆడిషన్స్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యిన తర్వాత నన్ను సినిమాలో ఎంపిక చేసినట్లు చెప్పారు.

ఆ తర్వాత నన్ను బయట ఉండమని చెప్పి మా అమ్మను లోపలికి పిలిచారు. ఆమెతో కమిట్‌మెంట్ గురించి అడిగారు. ఆ తర్వాత మా అమ్మ నన్ను లోపలికి పిలిచింది. అప్పటికే నాకు లోకజ్ఞానం కొంతవరకు ఉంది. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాలపై అవగాహన ఉండేది. వారు ‘కమిట్‌మెంట్’ గురించి మాట్లాడగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత మా అమ్మ వారితో మీరు సినిమాలో అవకాశం ఇస్తే ఎలాంటి పారితోషికం లేకుండానే మా అమ్మాయి మీ సినిమాలో నటిస్తుంది. కానీ ఇలాంటి షరతులు మాకు అస్సలు నచ్చవు అని చెప్పి మేము అక్కడి నుంచి బయటకు వచ్చేశాము. ఇలా దాదాపు 14 ఏళ్ల క్రితం, నా 16వ ఏట నాకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది” అని ఆమె చెప్పుకొచ్చింది.

Next Story