- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన వీరభద్రుడు
వీరభద్రుడు చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: సూర్య తాజాగా ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. విడుదలకు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు రొటీన్‌గా ఉండటంతో తమిళ ప్రేక్షకుల్లో మాత్రమే కొంత అంచనాలు ఉండగా, తెలుగులో మాత్రం పెద్దగా హైప్ కనిపించలేదు. అయితే తక్కువ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. సాయి అభ్యంకర్ సంగీతం అందించగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు మరియు ఎస్.ఆర్. ప్రకాష్ బాబు నిర్మించారు.






