శ్రీను వైట్ల ప్రాజెక్ట్ కోసం శర్వానంద్ సాహసోపేత నిర్ణయం

by Pulgam srinivas |   (  Updated:2026-06-12 03:40:12  IST  )

శ్రీను వైట్ల సినిమాను శర్వానంద్ స్వయంగా కో-ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

శ్రీను వైట్ల ప్రాజెక్ట్ కోసం శర్వానంద్ సాహసోపేత నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ కొంతకాలం వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలోనే ఆయనకు ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో పరవాలేదనే స్థాయి విజయం దక్కింది. అనంతరం ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కొంతకాలం క్రితం ‘బైకర్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన శర్వా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకోకపోయినా, ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

ప్రస్తుతం శర్వానంద్, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోగి’ అనే పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యాడు. మొదట ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడానికి సిద్ధమైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

దీంతో ఈ చిత్రాన్ని అనిల్ సుంకరతో కలిసి శర్వానంద్ కో-ప్రొడ్యూస్ చేస్తూ స్వయంగా సమర్పించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక శ్రీను వైట్ల సినిమాకు శర్వానంద్ కో-ప్రొడ్యూసర్‌గా కూడా మారడంతో, ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన వీరభద్రుడు

Next Story