జల్లాపురం స్టేజ్ వద్ద ప్రమాదం.. మామిడిపండ్ల వాహనం బోల్తా

by Jakkula.Mamatha |

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నుంచి హైదరాబాద్‌కు మామిడిపండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ వాహనం జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది.

జల్లాపురం స్టేజ్ వద్ద ప్రమాదం.. మామిడిపండ్ల వాహనం బోల్తా
X

దిశ, అలంపూర్: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నుంచి హైదరాబాద్‌కు మామిడిపండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ వాహనం జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. జల్లాపురం స్టేజ్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ శివకు బలమైన గాయాలు కాగా, అతనితో పాటు ప్రయాణిస్తున్న అనిల్, భానుప్రకాశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన డ్రైవర్‌ను కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వెళ్లడంతోనే ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Next Story