- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వీర ధీర శూరన్-2’ సెకండ్ సింగిల్ అప్డేట్.. క్యూరియాసిటీని పెంచుతున్న పోస్టర్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) గత ఏడాది ‘తంగలాన్’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) గత ఏడాది ‘తంగలాన్’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ ‘వీర ధీర శూరన్-2’(Veera Dheera Sooran-2) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో దుషార విజయన్(Dushara Vijayan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య, సూరజ్ వెంజరమూడు, సిద్ధిక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాను హెచ్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శింబు (Riya Simbu)నిర్మిస్తుండగా.. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
షూటింగ్ పూర్తి కానందున ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ మూవీ 2025 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ‘వీర ధీర శూరన్-2’ మూవీపై హైప్ పెంచుతున్నారు. తాజాగా, చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆతి అది ఆతి’’ అనే సాగే పాట మార్చి 5న రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో చియాన్ విక్రమ్, దుషార పెళ్లి దండలు వేసుకుని గుడిలో దండం పూజ చేయించుకున్నట్లుగా కనిపించి అందరిలో క్యూరియాసిటీని పెంచారు.
— G.V.Prakash Kumar (@gvprakash) March 3, 2025






