బేబీ గర్ల్ పేరెంట్స్‌కు VD-14 టీమ్ బంపరాఫర్.. మీ పాప సినిమాలో పాల్గొనే చాన్స్(ట్వీట్)

by I. Sairam |   (  Updated:2025-07-09 04:25:16  IST  )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ‘వీడీ-14’(VD-14) ఒకటి.

బేబీ గర్ల్ పేరెంట్స్‌కు VD-14 టీమ్ బంపరాఫర్.. మీ పాప సినిమాలో పాల్గొనే చాన్స్(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ‘వీడీ-14’(VD-14) ఒకటి. రాహుల్‌ సంకృత్యాన్(Rahul Sankruthyan) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించ‌బోతుంది. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రాయలసీమ నేపథ్యంలో 1854 – 1878 మధ్య కాలంలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందనుంది. దీంట్లో విజయ్‌ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ సినిమాలో ర‌ష్మిక(Rashmika Mandanna) క‌థానాయిక‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ టీమ్ బేబీ గర్ల్ తల్లులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సినిమాలో పాల్గొనే చాన్స్ ఉందని తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘మేము ఒక చిన్న బేబీ గర్ల్ కోసం ఎదురు చూస్తున్నాము. అయితే ఆ పాప ఏజ్ 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉండాలి.. హైట్ వచ్చేసి 3ఫీట్ 2ఇంచెస్‌కి తక్కువగా ఉండాలి.. ఇక స్కిన్ కలర్ డస్కీ అండ్ డార్క్‌‌‌గా పాప సన్నగా ఉండాలి’ అని రాసుకొచ్చారు. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు తమ పాపల ఫొటోస్‌ను ఈ నెంబర్‌కి పంపండి అని నెంబర్ మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా పైన చెప్పిన పోలికలతో పాప ఉంటే వెంటనే కింద ఇచ్చిన నెంబర్‌కి ఫొటోస్ షేర్ చేసి మూవీలో నటించే చాన్స్ కొట్టేయండి. Link

Next Story