- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lavanya Tripathi: భార్య కోసం ఆ పని చేసిన వరుణ్ తేజ్.. అసలు విషయం చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ
మెగా కోడలు అయ్యాక లావణ్య పూర్తిగా ఇంటికే పరిమితం అయింది.

దిశ, వెబ్ డెస్క్ : హీరో వరుణ్ తేజ్ ( Varun Tej ) భార్య లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది. ఈ సొట్ట బుగ్గల బ్యూటీ ఎన్నో సినిమాల్లో నటించి చివరకు ఎవరూ ఊహించలేని విధంగా మెగా హీరోతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.
ఇక పెళ్లై ఏడాదికి పైగా అవుతున్నా ఆమె మూవీస్ కు జోలికి పోలేదు. మెగా కోడలు అయ్యాక లావణ్య పూర్తిగా ఇంటికే పరిమితం అయింది. దీంతో, చాలా మంది ఆమె ఇకపై సినిమాలు చేస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారి అనుమానాలకు లావణ్య చెక్ పెట్టింది.
" లావణ్య త్రిపాఠి " మెయిన్ రోల్ లో ఒక సినిమా మొదలు పెట్టింది. సోమవారం ఆ చిత్రాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్ఎంఎస్ ( SMS ) సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు తాతనేని సత్య తెరకెక్కిస్తున్నాడు. ఇక, ఈ సినిమాకి ‘సతీ లీలావతి’ ( Sathi Leelavathi ) అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జరిగాయి. అంతే కాదు, ఈ కథను వరుణ్ తేజ్ ( Varun Tej ) సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. తన సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ వేడుకలో మూవీ యూనిట్ తో పాటు భర్త మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు. దీంతో, మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకం పై ఈ సినిమాని మోహన్ బాబు, ఎమ్, రాజేష్.టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి, ఈ చిత్రంతో లావణ్యకు హిట్ కొడుతుందో? లేదో చూడాలి. దీనికి మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.






