- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొరియాలో ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుత షెడ్యూల్ కొరియాలో జరుగుతోంది. దాంతో ఈయన కొరియా వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆఖరిగా విజయాన్ని అందుకొని చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అది కాస్త కొత్తగా ఉండడంతో ఒక్కసారిగా ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మూవీ యూనిట్ తాజాగా కొరియాలో కీలకమైన షెడ్యూల్ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. దానితో వరుణ్ తేజ్ కొరియా వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వరుణ్ గత కొద్ది కాలంగా విజయాలు లేక ఎలా సతమతం అవుతున్నాడో మేర్లపాక గాంధీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈయన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి విజయాన్ని అందుకున్నాడు.
ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రాజాతో ఆ ఫామ్ అలాగే కంటిన్యూ చేశాడు. కానీ ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన కృష్ణార్జున యుద్ధం ఫెయిల్యూర్ అయింది. మాస్ట్రో మంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ థియేటర్లలో విడుదల కాలేదు. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ డిజాస్టర్ అయింది. గత కొంతకాలంగా డౌన్ ఫాల్లో కెరియర్ను కొనసాగిస్తున్న ఈ ఇద్దరు కలిసి కొరియన్ కనకరాజు చిత్రంతో మంచి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.






